టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ బాధితుడు కలిశాడు. మాచర్లకు చెందిన దండు పెద వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తన కుమారుడి కోసం వచ్చి తనపై దాడి చేశారని వెంకయ్య వాపోయాడు. రక్తంతో తడిసిన చొక్కాతో వెంకయ్య రావడం, బోరున విలపించటంతో అతడిని చూసి చంద్రబాబు చలించిపోయారు.
టీడీపీకి మద్దతుగా ఉన్నందుకే దాడి చేశారని వెంకయ్య వాపోయారు. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారనే ఉద్దేశంతోనే పెద వెంకయ్య అనుచరులు దాడి చేశారంటున్నారు. బాధితుడిని డీజీపీ, ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లాలని వర్ల రామయ్యకు సూచించారు. ప్రాథమిక చికిత్స చేయించాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల ప్రజలు భారీగా తరలివచ్చారు.