భారతీయ కిసాన్ యూనియన్ నేత, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పై దాడి జరిగింది. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయనపై కొందరు దాడికి దిగారు. దీంతో గందరగోళ పరిస్తితి నెలకొంది.
కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ మీడియా ఛానల్ కథనం ప్రసారం చేసింది. ఆ కథనానికి సంబంధించి టికాయత్, మరో నేత యుద్ధవీర్ లు మీడియా సమావేశం నిర్వహించారు.
చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని టికాయత్, యుద్దవీర్ డిమాండ్ చేశారు. ఆ సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు సమావేశం వద్దకు చేరుకున్నారు.
టికాయత్, యుద్ధవీర్ లపై వారు సిరా చల్లారు. దీంతో టికాయత్ అనుచరులు వారిపై ప్రతి దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడి చేసుకున్నారు.
సమావేశ సమయంలో తనకు ఎలాంటి భద్రతా కల్పించలేదని ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే తనపై దాడి జరిగిందని టికాయత్ అన్నారు.