న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీష్. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇంకోసారి అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. నాని-రీతూ వర్మ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించగా… శ్రేయా గోషల్, కాల బైరవ పాట పాడారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 23న సినిమా రిలీజ్ కాబోతుంది. జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తుండగా… షైన్ స్ర్కీన్స్ నిర్మిస్తుంది.