ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనల అనంతరం కేసు విచారణను వచ్చే నెల 17కు కోర్టు వాయిదా వేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గతేడాది నవంబర్‌లో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 10వేల పేజీలతో సీబీఐ ఛార్జిషీట్ తయారు చేసింది.
ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ మహేంద్రుడు అరుణ్ రామచంద్ర పిళ్లై, ముఠా గౌతంలతో పాటు పలువురు ఎక్సైజ్ అధికారుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో చేర్చింది.
ఈ కేసులో తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులతో పాటు ఢిల్లీ సర్కార్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.