మహిళలకు రక్షణగా నిలవాల్సిన రక్షక భటుడే బాధ్యత మరిచిపోయి తోటి మహిళా ఎస్సైని వేధించడంతో విసిగిపోయిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సంతోష్‌నగర్ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ వంశీకృష్ణరావు ఓ మహిళా ఎస్‌ఐని వేధింపులకు గురిచేస్తున్నాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక విచారణ జరిపి సదరు ఇన్‌స్పెక్టర్‌ను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశారు. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్‌బీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
భవానీనగర్ పోలీస్ స్టేషన్ డీఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)గా పనిచేస్తున్న జి. శేఖర్‌రెడ్డికి సంతోషనగర్ ఎస్‌హెచ్‌వో బాధ్యతలు అప్పగిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.