బొమ్మ తుపాకీ చూపించి బ్యాంక్ దోచెద్దాం అనుకున్నాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇది సినిమాలో సీను అనుకునేరు.! నిజంగా నిజం.! ఈ తింగరి దొంగతనానికి అతనికి తగిలిన దెబ్బలు మాత్రం డమ్మీకాదు. వీపు విమానం మోత మోగిపోయింది. ఈఘటన తమిళనాడులోని ఓ బ్యాంకులో చోటుచేసుకుంది.
తిరుపూర్ జిల్లా ధర్మాపురం కెనారా బ్యాంకులో రద్దీగా ఉంది. అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాంక్ పరిశరాలను అంతా గమనించాడు. అయితే బ్యాంక్ లో కాస్త రద్దీ తగ్గింది. ఇదే అదునుగా భావించిన లేతదొంగ ఫేస్ కు మాస్క్ ధరించాడు. బొమ్మతుపాకీతో బ్యాంక్ లో కూర్చున్న వారిని ఆ బొమ్మతుపాకీ చూపించాడు. కొందరిని బెదిరించి ఒకరిపై గురిపెట్టాడు.
అంతే సీన్ రివర్స్ అయ్యింది. డ్యూప్లికెట్ తుపాకీ, బాంబుతో బ్యాంక్ లోని కస్టమర్స్ భయపెట్టాడు. బోమ్మ తుపాకీ తిప్పుతున్న సమయంలో తుపాకి చేతినుండి కిందపడిపోవడంతో దొంగను వృద్ధుడు తన వద్దవున్న టవల్ తో దొంగ చేతులను గట్టిగాపడ్డుకున్నాడు. అక్కడున్న వారందరూ ధైర్యం చేసి దొంగపై విరుచుకుపడ్డారు. దొంగను కిందపడేసి చితకొట్టారు.
బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన పోలీసులు బ్యాంక్ దగ్గరకు చేరుకున్నారు. దొంగను అదుపులో తీసుకున్నారు. ఈఘటన సీసీ టీవిలో రికార్డు కావడంతో ఈ కామెడీ సీను వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సురేష్ గా గుర్తించారు పోలీసులు.
ఆన్‌లైన్‌లో బొమ్మ తుపాకీని కొనుగోలు చేసి, డమ్మీ బాంబును తయారు చేయడానికి రెడ్ టేప్‌తో చుట్టి, స్విచ్ బాక్స్ ను ఉపయోగించి కిచెన్ టైమర్‌ను అంటించాడు. అయితే దొంగను పట్టుకోబోయిన ఆపెద్దాయన అతడిని నేలపై పడేయడంతో గాయపడ్డాడు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సమగ్ర విచారణ చేపట్టారు పోలీసులు.