ఆస్ట్రేలియాలో రగులుతున్న కార్చిచ్చును అదుపుచేసేందుకుగాను ఓ మోడల్ తనకు తోచిన తీరులో ముందుకొచ్చింది. ఆ దేశ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు తాను వెరైటీగా ప్రయత్నించి ప్రశంసలు అందుకుంటుంది. అమెరికాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ మోడల్ కైలెన్ వార్డ్.. తనకు విరాళాలు పంపే వారికీ తన న్యూడ్ ఫోటోలు పంపుతానని ఆఫర్ చేసింది.
ఈ మోడల్ అలా ప్రకటించిందో లేదో అప్పడే రూ.5కోట్లకు పైగా విరాళాలు సమకూరాయి. తనకు విరాళాలు పంపిన వారందరికీ తన న్యూడ్ పిక్స్ ను పంపింది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ నిబంధనలు ఉల్లఘించిందని అకౌంట్ ను బ్లాక్ చేశారు. మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో కూడా న్యూడ్ ఫోటోలు పంపడంతో మరోసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేశారు. అయితే.. కైలెన్ చర్యను కొంతమంది సమర్థిస్తుండగా మరికొందరు ఇలా చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.