ఎంతో పవిత్రంగా హిందువులు భావించే తీర్థయాత్రల్లో ఒకటి ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో అన్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ… యాత్రకు వచ్చే భక్తులకు అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు వ్యాక్సిన్ ను తప్పనిసరి చేసింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ ను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఏపీ, కేరళ, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు మాత్రం రెండు డోసులు పూర్తైన కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటు… 72గంటల్లోపు చేసిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా సమర్పించాలి. మిగతా ప్రాంతాల వారు ఈ రెండింటిలో ఎదో ఒకటి సమర్పించిన సరిపోతుంది.
బద్రీనాథ్ కు రోజుకు వెయ్యి మంది చొప్పున కేదార్ నాథ్ కు 8 వందల మంది, గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.