దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 12న పరీక్ష జరగనుంది. దీనిపై పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. అబ్బాయిలు హాఫ్ షర్ట్స్ తో రావాలని, షూ వేసుకొని రావొద్దని కోరింది. ఇక అమ్మాయిలకు చెవి పోగులతో పాటు మెడలో ఎలాంటి చైన్స్ ఉండకూడదని ఆదేశించింది.
విద్యార్థులకు చేసిన మరిన్ని సూచనలు
– విద్యార్థులు మతపరంగా పొడుగు డ్రెస్ లు కచ్చితంగా వేసుకోవాల్సి వస్తే మధ్యాహ్నం 12.30గంటల కల్లా ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకోవాలి.
-షూ వేసుకుంటే పరీక్షకు నో ఎంట్రీ. సాధారణ చెప్పులు, తక్కువ ఎత్తులో ఉండే హీల్స్ కే అనుమతి
-వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, టోపీలు వంటివి నిషేధం.
– పెన్నులు, స్కెచ్ పెన్నులు, కాలిక్యులేటర్స్ వంటివి నిషేధం.
-ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.
-వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలను అనుమతించరు.
దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్ష హిందీతో పాటు 11 దేశీయ భాషల్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 5గంటల వరకు పరీక్ష జరగనుండగా అభ్యర్థులంతా ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు.