రష్యాకు ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించలేమని ఆ కంపెనీలు చెప్పేశాయి. ఈ మేరకు ఇప్పటికే పలు కంపెనీలు రష్యాలో కార్యకలాపాలను ఆపివేశాయి.

రష్యాలోని అన్ని వ్యాపార కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
ఈ కష్ట సమయంలో రష్యాలో ఉన్న 1200 మంది ఉద్యోగులతో పాటు, ఇతర ఉద్యోగులకు సహాయం చేసేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. గ్లోబల్ ఆపరేషన్స్ కు కలిగే ఆటంకాలను తక్కువ చేసేందుకు వ్యాపార కొనసాగింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది.