సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. అయితే తనపై విధించిన సస్పెన్షన్ పై ఏవీ వెంకటేశ్వరరావు స్పందించాడు. ప్రభుత్వ చర్యల వలన తనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదన్నారు. కానీ తనపై వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.అయితే ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తానని చెప్పారు. దీనిపై ఆయన ఓ లేఖను కూడా విధించారు.
ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఏపీ డీజీపీ నివేదిక సమర్పించాడు. ఈమేరకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.