ఇంటర్ బోర్డుకు పట్టిన శని వదిలింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. కొత్త సెక్రటరీగా సయ్యద్ ఉమర్ జలీల్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ విద్యార్థుల పాలిట విరగడైన పీడ
ఇంటర్ బోర్డు సెక్రటరీగా సయ్యద్ ఉమర్ జలీల్ నియామకం
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యార్థుల పాలిట విలన్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఎట్టకేలకు ప్రభుత్వం బదిలీ చేసింది, వేరే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంటర్ అడ్మిషన్స్ నుంచి ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి 22 మంది అమాయకపు విద్యార్థుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం అయ్యాడు అశోక్ కుమార్. విద్యార్థుల చావులపై అశోక్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేగింది. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఎంత వత్తిడి తెచ్చిన ప్రభుత్వం మాత్రం అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోలేదు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అశోక్ కుమార్ వచ్చాక బోర్డు పరిస్థితి రోజురోజుకు దిగజారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అశోక్ కుమార్‌ను బదిలీ చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని, ఇకనైనా బోర్డు పనితీరు మెరుగవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు.