చదువును నిర్లక్ష్యం చేస్తూ అతిగా సెల్ ఫోన్ చూస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో.. మనస్తాపం చెందిన ఓ కుర్రాడు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది.
ఐఎస్‌సదన్ డివిజన్ ఎస్‌బీఐ ఆఫీసర్స్ కాలనీలో నివాసముండే పోతురాజు ఏపీలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా, ఆయన భార్య సంగీత బోజ్‌రెడ్డి మహిళా కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దొంతం ధృవ కాపర్తి(16) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
కొద్ది నెలలుగా చదువు నిర్లక్ష్యం చేస్తూ సెల్‌ఫోన్‌కు బానిసై మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి కూడా ధృవ నిద్రపోకుండా సెల్‌ఫోన్ చూస్తుండగా.. తల్లి అతడి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని నిద్రపొమ్మని చెప్పింది.
మనస్తాపానికి గురైన ధృవ బయటకు వెళ్లి, ఇంటికి తాళం వేసి, ఐదో అంతస్తు నుంచి దూకాడు. గాయాపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.