సాధారణంగా మనకు తెలియని ప్రాంతానికి వెళ్తే.. గూగుల్ మ్యాప్ సహాయంతో ఆ ప్రదేశానికి చేరుకుంటాం. అయితే ఇదే గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ స్టూడెంట్ మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి.. గురువారం ఎగ్జామ్ రాయాల్సి ఉంది. దీంతో గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు.
పరీక్షా కేంద్రంలోకి హడావిడిగా ప్రవేశించబోతున్న వినయ్ హాల్ టికెట్ ను అధికారులు పరిశీంచారు. కట్ చేస్తే అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో వినయ్ షాక్ అయ్యాడు. తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లడంతో.. ఆ స్టూడెంట్ కన్నీళ్లతో వెనుదిరిగాడు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చాలా మంది విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.