ఒక నిమిషం నిబంధన ఇంటర్ విద్యార్థుల కొంప ముంచింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కాగా మొదటి రోజే విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్న ఆదేశాల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకున్నారు.
కానీ కొందరు మాత్రం దురదృష్టవశాత్తు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేక పోయారు. వారిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు.
దీంతో వారు కన్నీటి పర్యాంతం అయ్యారు. ఎంత బ్రతిమిలాడినా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు.
తొలి రోజు నిజామాబాద్ లో పది మంది, వేముల వాడలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించ లేదు.