బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం సీఎం కేసీఆర్ చేయలేరని ఆయన అన్నారు. ఒక వేళముందస్తుకు వెళితే సంతోషడే మొదటి పార్టీ బీజేపీనే అని అన్నారు. మెదక్‌లో బీజేపీ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈడీ కేసులు పెట్టిందో చెప్పాలన్నారు. తెలంగాణలో దోచుకున్నది సరిపోకే సీఎం కుమార్తె ఢిల్లీలోనూ దోచుకోవాలనే దురాశతో మద్యం కుంభకోణంలో వేలు పెట్టిందని పేర్కొన్నారు.
కుంభకోణంలో దర్యాప్తులో భాగంగానే కవిత పేరును చేర్చారని తెలిపారు. అంతే కానీ ప్రత్యేకంగా ఎవరినీ టార్గెట్ చేసింది లేదన్నారు. కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్షంలో విహరించిన తమకేమీ అభ్యంతరం లేదన్నారు. తమ లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనన్నారు.
హిందుత్వ, జాతీయ వాదంతో గతంలో 44 శాతం ఓటు బ్యాంకు సాధించిందన్నారు. ప్రస్తుతం అది 50 శాతానికి పెరిగిందన్నారు. బీజేపీ అభ్యర్థులు పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలని, ప్రజలతో ఉంటే గెలుపు కోసం బెంగ పడాల్సిన అవసరమే లేదని వెల్లడించారు.