2000 తర్వాత సినిమాల్లోకి వచ్చిన బాల నటులు అందరూ ఇప్పుడు పెళ్ళికి రెడీ గా ఉన్నారు. అప్పుడు బుల్లి బుల్లి మాటలతో మనకు మంచి వినోదాన్ని పంచిన నటులు… ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా కూడా కనపడుతున్నారు. హీరోయిన్ లుగా కూడా రావడానికి రెడీ అవుతున్నారు.
Also Read:రాజ్యాంగాన్ని రద్దు చేస్తే.. రాతియుగమే..!
అందులో ఒక్కడు సినిమాలో మహేష్ చెల్లిగా నటించిన చిన్నారి చాలా మందికి గుర్తు ఉంటుంది. మహేష్ బాబు చెల్లిగా నిహారిక అనే అమ్మాయి నటించింది. ఆ సినిమా తర్వాత చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. సినిమాలు వచ్చినా సరే… కచ్చితంగా చదువుకోవాలనే తపనతో వాటిని పక్కన పెట్టింది. ఈ మధ్యనే ఆమె చదువు కూడా పూర్తి అయింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడానికి కష్టపడుతున్న ఆమె… ఫోటో షూట్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం రాకపోగా… త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు తో సన్నిహితంగా ఉండే దర్శకుడు ఒకరు ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇక ప్రేమించుకుందాం రా సినిమాలో కూడా వెంకటేష్ పక్కన కనపడింది. ఆ సినిమాలో ఆయన్ను మావయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆమె ఎంత వరకు అవకాశాలు తెచ్చుకుంటుంది ఏంటీ అనేది చూడాలి.
Also Read:దమ్ముంటే గన్ పార్క్ దగ్గరకు రా.. కేసీఆర్ కు బండి సవాల్