`స్వయంవరం` మూవీతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆమె తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకుంది.
వివాహం అయిన తరువాత సినీ పరిశ్రమకి పూర్తిగా దూరమైంది లయ. అమెరికాలోనే స్థిరపడింది. లయకు ఇద్దరు పిల్లలు. ఆమె వెండితెర పై కనిపించకపోయినా.. కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్లు, డ్యాన్స్ వీడియోలతో ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. అయితే చాలా కాలం తర్వాత లయ ఇటీవలె అమెరికా నుంచి ఇండియా వచ్చింది.
ఇక వచ్చింది మొదలు నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తెగ హడావుడి చేస్తోంది. గత రెండు వారాల నుంచి లయకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఉన్నట్లుండి లయ ఆమెరికా నుంచి ఊడిపడటం వెనక పెద్ద ప్లానే ఉందట. లయకు శ్లోకా అనే కూతురు ఉంది. ఆమె లయ మాదిరిగానే చాలా అందంగా ఉంటుంది.
అయితే కూతురును హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు లయ ఇక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హడావుడి చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కూతురు శ్లోకాను ఇండస్ట్రీకి తీసుకురావాలని ఉందంటూ మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మంచి సినిమాతో కూతురును తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయాలని భావిస్తుందట. ఇందులో భాగంగానే తనకు తెలిసిన దర్శకనిర్మాతలు చర్చలు సైతం మొదలు పెట్టిందని టాక్.