మహేష్ తో సినిమా చేయాల్సిన సుకుమార్, బన్నీ చెంతకు చేరాడు. పుష్ప సినిమా తీశాడు. కట్ చేస్తే, అది పెద్ద హిట్టయింది. బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. దీంతో ఇప్పుడు మరోసారి మహేష్ చుట్టూ హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. అప్పట్లో మహేష్ ఈ సినిమాకు ఓకే చెబితే బాగుండేదంటూ చర్చ నడుస్తోంది. నిజానికి ఈ విషయంపై సుకుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
పుష్ప ప్రమోషన్ లోనే ఈ అంశంపై సుకుమార్ మాట్లాడాడు. పుష్ప సినిమాకు మహేష్ కు సంబంధం లేదని, మహేష్ కు తను వేరే స్టోరీలైన్ చెప్పానని ప్రకటించుకున్నాడు సుక్కూ. కానీ నెటిజన్లు మాత్రం ఈ మేటర్ నమ్మడం లేదు. సుకుమార్ అంత తొందరగా మరో కొత్త స్టోరీపై వర్కవుట్ చేసి సెట్స్ పైకి వెళ్లలేడని, అది పుష్ప స్టోరీనే అంటూ పోస్టులు పెడుతున్నారు.
అటు మరికొంతమంది నెటిజన్లు మాత్రం, పుష్ప ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకొని మంచి పని చేశాడంటున్నారు. పుష్ప పాత్రలోని రఫ్ నెస్ ను, ఆ చేయి పైకి లేచే మేనరిజమ్స్ ను మహేష్ పండించలేడని అంటున్నారు. దీనికి మహేష్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మంచి క్యారెక్టర్ పడితే మహేష్ ఎలాంటి గెటప్ లోకైనా మారతాడని, ఎలాంటి పాత్ర అయినా చేస్తాడని చెబుతున్నారు. చాలామంది మాత్రం మహేష్ ను నీట్ గా, అఫీషియల్ గా చూసేందుకే తాము ఇష్టపడతామని, పుష్ప ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకోవడం మంచిదే అయిందంటూ పోస్టులు పెడుతున్నారు.
ఓవైపు సుకుమార్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఇలా వందల సంఖ్యలో పోస్టులు ప్రతి రోజూ పడుతూనే ఉన్నాయి. పుష్ప సినిమా ఉత్తరాదిన పెద్ద హిట్టవ్వడమే ఈ చర్చకు ప్రధాన కారణం. ఎందుకంటే, మహేష్ కు నార్త్ లో మంచి సక్సెస్ పడలేదు ఇప్పటివరకు. అందుకే పుష్ప సినిమా వదిలేసి మహేష్ తప్పుచేశాడంటున్నారు కొంతమంది.