గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో మంచు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ గురించి చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక గత ఏడాది వినాయక చవితి సమయంలో మనోజ్, మౌనిక కలిసి పూజలు నిర్వహించడంతో.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు వచ్చాయి.
ఇటీవల కడప దర్గాకి వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో కొత్త జీవితం మొదలు పెడుతున్నా, ఈసారి ఇక్కడికి కుటుంబంతో వస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పెళ్లి అనే కథనాలకు ఈ మాటలు మరెంత బలాన్ని ఇచ్చాయి. దివంగత పొలిటీషియన్ భూమా నాగిరెడ్డి తనయ మౌనికను మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగినట్లు మనోజ్ సైతం ఆమెతో కలిసి బయట కనిపించారు.
నెట్టింట వినిపిస్తోన్న సమాచారం మేరకు మనోజ్, మౌనికల వివాహం జరగనుంది. అయితే దీనిపై ఇటు మంచు ఫ్యామిలీ, అటు మౌనిక ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు, తన సినిమాలన్నీ కూడా కొత్త సంవత్సరంలోనే ప్రారంభమవుతాయని మంచు మనోజ్ చెప్పారు. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
మంచు మనోజ్‌కి ఇదివరకే ప్రణతి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే మనస్పర్దలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికకు కూడా ఇది వరకే వివాహం జరిగింది. ఆమె కూడా తన వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. మరో వైపు మంచు మనోజ్.. భూమా మౌనికకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. ఇప్పుడు ఆ పరిచయమే వివాహానికి దారి తీస్తోందని టాక్ బలంగా వినిపిస్తోంది మరి.
Also Read: ఈ సంక్రాంతి హానీదే!!