హిట్లర్” ఈ పేరు చెప్తే కొన్ని దేశాల ప్రజలకు ఇప్పటికి కూడా భయంగానే ఉంటుంది. ఇక హిట్లర్ అనగానే అతనో నియంత అనేది చాలా మంది మదిలో మెదులుతుంది. హిట్లర్ అనే వాడు పుట్టకుండా ఉండి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం అనే మాట వినపడి ఉండేది కాదు. కొన్ని దేశాల రాజకీయ ముఖ చిత్రం కూడా మరోలా ఉండేది అనే మాట వాస్తవం. హిట్లర్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read: చెమట పొక్కులు ఎలా వస్తాయి…? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి…?
హిట్లర్ కు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను మూడు సార్లు తనకి దగ్గరలో ఉన్న పెయింటింగ్ స్కూల్ కి అడ్మిషన్ కి అప్లై చేసాడు కాని రిజక్ట్ చేసారు. అక్కడ సీట్ రాకపోయేసరికి సైన్యంలో జాయిన్ అయ్యాడు. అక్కడ జాతి వివక్ష సహా మరికొన్ని అంశాల మీద ఆసక్తి చూపించి రాజకీయం నేర్చుకుని… సైన్యం నుంచి బయటకు వచ్చి రాజకీయాలు, ఆ తర్వాత దేశాధ్యక్షుడు అయ్యాడు. రెండో ప్రపంచ యుద్దానికి కారణమై ప్రపంచ గతిని మార్చేశాడు.
అదే పెయింటింగ్ స్కూల్ లో సీటు వచ్చి ఉంటే గొప్ప పెయింటర్ అయి ఉండే వాడు. ఇక అతని గురించి తెలియని మరికొన్ని ఆసక్తికర విషయాలు ఏంటీ అంటే… హిట్లర్ పూర్తిగా శాఖాహారి కావడంతో వేటకు వెళ్ళడం, గుర్రపు పందాలు వంటి వాటిని నిషేధించాడు. ఇక తాను రాసిన పుస్తకాన్ని పెళ్లిళ్లకు గిఫ్ట్ గా ఇచ్చే విధంగా చట్టం చేసాడు. జంతువుల ప్రాణాలకు, వాటి బాధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాడు.
వాల్ట్ డిస్నీ సినిమాలు అంటే హిట్లర్ కు చాలా ఇష్టం. పెయింటర్ అవ్వడానికి ముందు ప్రీస్ట్ అవుదాం అనుకుని వెనక్కు తగ్గాడు. ఇక ఎద్దుల వీర్యాన్ని ఇంజెక్ట్ చేసుకునేవాడు అని ఒక ప్రచారం జరిగింది. యుద్దంలో తన ముఖానికి దెబ్బ తగలడం తో మీసం అలా భిన్నంగా చేయించుకున్నాడు.
Also Read : నరసింహనాయుడు తో పవన్ ను బీట్ చేసిన బాలయ్య