సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ను ఫిక్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. బిల్లా గా పవర్ స్టార్ రంగాగ రానా నటించనున్నారని సమాచారం. 1982 లో మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బిల్లా రంగా ఘన విజయం సాధించింది. ఇక అదే టైటిల్ ను ఈ సినిమాకి పెట్టడం పట్ల అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.