కేజీఎఫ్ సినిమా చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద యాక్షన్ ఫ్రాంచైజీనో తెలిసిందే. ఇప్పటికే దీని రెండు పార్ట్ లు సూపర్ హిట్ కాగా మూడో పార్ట్ కూడా త్వరలోనే రానున్నట్లు చిత్రవర్గాలు రెండో పార్ట్ చివరిలోనే హింట్ ఇచ్చాయి. అయితే మూడో పార్ట్ ఎప్పుడూ వస్తుంది అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.
తాజాగా ఆ సస్పెన్స్ కి తెరపడింది. సలార్, ఎన్టీఆర్ 31 సినిమాలు ముగిసిన వెంటనే కేజీఎఫ్ 3 సెట్స్ మీదకు తీసుకెళ్లేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన నీల్ వర్స్ లో భాగంగా ఈ మూడు సినిమాలకు లింక్ ఉంది కాబట్టి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎన్టీఆర్ 31 సినిమా పూర్తైన వెంటనే కేజీఎఫ్ 3 ని తెరకెక్కించనున్నట్ఉల వార్తలొస్తున్నాయి.
2024 చివర్లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ 28 వ తేదీన దీనిని రిలీజ్ చేయబోతున్నాడు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను కూడా రెండు భాగాల్లో ప్లాన్ చేశారు. సలార్ రిలీజైన వెంటనే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని ప్రశాంత్ నీల్ మొదలు పెట్టనున్నాడు.
2024 చివర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేలా పక్కా స్కెచ్ వేసినట్లు వార్తలొస్తున్నాయి.ఆ వెంటనే కేజీఎఫ్ 3 ప్రాజెక్టు ప్రారంభింంచాల్సి ఉంటుంది. కాబట్టి తారక్ సినిమాను తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది.