మాస్ మహరాజా రవితేజ హీరోగా, అప్ కమింగ్ యాక్ట్రెస్ శ్రీలీల నటించిన చిత్రం ‘ధమాకా’. ఈ సంవత్సరాంతంలో రిలీజైన ఈ మూవీకి బిగినింగ్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంటుగా వచ్చిన సినిమాల మేలు కలయిక అని విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లను బట్టిచూస్తే ఇది మామూలు ‘ధమాకా’ కాదు, ‘డబుల్ ధమాకా’ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. న్యూ ఇయర్ టార్గెట్ గా వచ్చిన అవతార్, సంక్రాంతి బరిలోకి దిగిన చిరు, బాలయ్య సినిమాల ప్రవాహాన్ని సైతం తట్టుకుని నిలబడింది.
రవితేజకి మంచి కం బ్యాక్ లా నిలిచింది ‘ధమాకా’ చిత్రం. సంక్రాంతి సందర్భంగా ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా ధమాకా దుమ్ములేపుతుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధమాకా కొన్ని థియేటర్స్ లోనే ప్రదర్శితం అవుతున్నప్పటికీ వాటిలో కూడా ఆల్ మోస్ట్ ఈ పండుగలో హౌస్ ఫుల్స్ పడ్డాయని ట్రేడ్ టాక్ నడుస్తోంది. అయితే దీంతో ఓ మాస్ అండ్ కమర్షియల్ సినిమా పడితే రవితేజ ఏం చేయగలడో మరోసారి ప్రూవ్ చేసాడని చెప్పాలి.