మీర్ పేట్ టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. హాకీ స్టిక్స్ తో దాడి చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఆర్ఎన్ రెడ్డి నగర్లోని శ్రీ విద్యా వాణీ హైస్కూల్ లో మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆ సమయంలోనే టీఆర్ఎస్ నాయకులు కొట్లాటకు దిగారు. డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డితో పాటు సమావేశంలో పాల్గొన్న 15 మంది కార్పొరేటర్లపై… పదో వార్డు కార్పొరేటర్ పవన్, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, కర్రలతో విరుచుకుపడ్డారు.
ఈ దాడిలో విక్రమ్ రెడ్డితోపాటు 35వ వార్డు కార్పొరేటర్ భర్త గాయపడ్డారు. పవన్ 4 కోట్లతో ఓ చెరువును అభివృద్ధి చేసే కాంట్రాక్ట్ చేపట్టారు. దానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సగం బిల్లు విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మిగిలిన కార్పొరేటర్లు తమకు పెద్ద మొత్తంలో కమిషన్ కావాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే బిల్లు అపారన్న కోపంతో పవన్ దాడి చేసినట్లుగా సమాచారం. ఇక తనను కులం పేరుతో దూషించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పై 35వ డివిజన్ కార్పొరేటర్ భర్త మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.