కరీంనగర్ ప్రజలు…
కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీలో ముసలం. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తల మధ్య అంతర్గత కీచులాటలు బయపడుతున్నాయి. ఎవరికివారే తమ ఆదిపత్యాన్ని ప్రకటించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. వీరి తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కరీంనగర్ ప్రజలు అంతరంగం బట్టబయలవుతుంది.
మంత్రి అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ని, సోహన్ సింగ్ కమల్జిత్ కౌర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనడం ఎంతవరకూ సమంజసం. విలేకరుల సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లకు నేనొక్కటే ప్రశ్న అడుగుతున్నా. గతంలో మున్సిపల్ ఆఫీస్ కు తాళం వేశారు కార్పొరేటర్ భర్త.. పార్టీ ప్రతిష్టను పెంచారా.. గతంలో మున్సిపల్ సమావేశంలో మీడియా ముందు చెప్పులతో కొట్టుకున్న సంఘటన మర్చిపోయారా.. వారికి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము ఏ రోజు కోరలేదు.
గతంలో పద్మశాలి కులానికి చెందిన అబ్బాయిని బండబూతులు తిడుతూ.. బట్టలు ఊడదీసి కొడతా.. అనే వ్యక్తికి ఏ రోజు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరలేదు. శివారు ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్ వినాయక చవితి సందర్భంగా ఐమాక్స్ లైట్లు కట్టే ఎలక్ట్రిషన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈ గారికి తిడుతూ వినాయక మండపంలో మున్సిపల్ లైటింగ్ చేసే కార్మికునికి, వారి కుటుంబ సభ్యులకు బండ బూతులు తిట్టిన కార్పొరేటర్ ని సస్పెండ్ చేయాలని మేము ఏ రోజు కోరలేదు.
మేము మా డివిజన్ లో స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ నాసిరక పనులు చేస్తుంటే రాత్రిపూట టార్చ్ లైట్ పెట్టి పనులు చేస్తుంటే నిలదీసింది మేము. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి వలన టవర్ సర్కిల్ చుట్టూ ప్రకాశం గంజ్ రాజీవ్ చౌక్ శాస్త్రి రోడ్డు, అన్నపూర్ణ కాంప్లెక్స్ కు సంబంధించిన వ్యాపారవేతలు లక్షల కోట్ల నష్టపోయారు. వారిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీ పనులు త్వరగా చేయాలని స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చాము. దీనికి మాజీ మేయర్ రవీందర్ సింగ్, కమల్జీత్ కౌర్ సోహన్ సింగ్ కమిషన్ల కోసం స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ని ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కార్పొరేటర్లు అబద్దాలు పలకడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము.
కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు బుద్ధిమంతులు వారికి అన్ని విషయాలు తెలుసు. ఎవరు ల్యాండ్ మాఫియా చేస్తున్నారో ఎవరు లంచాలు తీసుకుంటున్నారో కరీంనగర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక మతానికి కించపరిచేలా మాట్లాడితే.. ఏ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టలే కనీసం స్పందించ లేదు.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయలేదు.
తెలంగాణ కేసీఆర్ చిత్రం ఆఫీసర్ ఛాయిస్ విస్కీ బాటిల్ పై ముద్రిస్తే ఏ ఒక్కరు స్పందించ లేదు కదా.. కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రా? లేదా మంత్రి గంగుల కమలాకర్ రా? ఎమ్మెల్సీకవిత అక్క గురించి ప్రతిపక్షాలు చెడుగా మాట్లాడితే ఏ ఒక్కరు స్పందించ లేదు. కానీ ఇవాళ ఆడియో రికార్డింగ్ దొరికితే ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి.. ప్రెస్ మీట్ పెట్టి మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు, సోహన్ సింగ్ కమల్జిత్ కౌర్ కార్పొరేటర్ కు సస్పెండ్ చేయాలని హడావిడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.