భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 27 నుంచి పునరుద్దరించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్య సభలో తెలిపారు.
బడ్జెట్ సెషన్ రెండో సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం ఆయన మట్లాడారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు మెరుగపడ్డాయని తెలిపారు.
దేశంలో అన్ని రెగ్యులర్ అంతర్జాతీయ విమానాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో మార్చి 27 నుంచి పనిచేస్తాయని ఆయన సభలో వెల్లడించారు.
కొవిడ్ నేపథ్యంలో అన్ని అంతర్జాతీయ విమానాలపై 23 మార్చి 2020న కేంద్రం నిషేధం విధించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రెండేండ్లుగా ఈ నిషేధం కొనసాగుతూ వస్తోంది.