ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ (ఐజేఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఐజేఎఫ్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
‘ ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో మేము కీలక నిర్ణయం తీసుకున్నాము. ఐజేఎఫ్ గౌరవ అధ్యక్ష పదవి, అంతర్జాతీయ జూడో సమాఖ్య రాయబారి పదవి నుంచి పుతిన్ ను సస్పెండ్ చేస్తున్నాము” అని ఐజేఎఫ్ ప్రకటించింది.
జూడోలో పుతిన్ బ్లాక్ బెల్ట్ పొందారు. 2012లో ఆయనకు ఎనిమిదవ డాన్‌ను ఐజేఎఫ్ ప్రధానం చేసింది. జూడోలో అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.
2008లో ఆయనను తమ గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు ఐజేఎఫ్ ప్రకటించింది. పుతిన్ కు జూడోతో పాటు ఐస్ హాకీ అన్న చాలా ఇష్టం.