భారతీయుల డిజిటల్ పవర్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇంటర్నెట్‌కు సంబంధించిన మెటీరియల్స్ అన్నింటిని త్వరలో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లు ప్రకటించారు.
ఇతర రంగాలతోపాటు డిజిటల్ రంగంలో భారత్ వేగంగా ఎదుగుతోంది. మన దేశ డిజిటల్ పవర్‌ను పెంచేందుకు ఇంటర్నెట్ మెటీరియల్స్‌ను హిందీ సహా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ప్రజలకు అందుబాటులో ఉంచుతామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దీని కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు.