దేశంలో ఇటీవల ఇంటర్నెట్ షట్ డౌన్‌లు ఎక్కువ అయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ షట్ డౌన్స్ విధించిన దేశాల్లో దేశం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు విషయాన్నిన్యూయార్క్‌కు చెందిన ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్‌డాగ్ ‘యాక్సెస్ నౌ’ అనే సంస్థ తెలిపింది.
మొత్తం 35 దేశాల్లో 137 ఇంటర్నెట్ షట్ డౌన్స్ విధించారు. ఇందులో అత్యధికంగా షట్ డౌన్స్(84) భారత్ లోనే విధించారని సంస్థ పేర్కొంది. వాటిలో 49 షట్ డౌన్స్ జమ్ము కశ్మీర్ లోనే జరిగాయని వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదో సారి కావడం గమనార్హం. వీ
అగస్టు 2019లో జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి.
ఈ క్రమంలో అప్పటి నుండి ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతంపై క్రమం తప్పకుండా కమ్యూనికేషన్ పరిమితులను విధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో భారత్ తర్వాత రష్యా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి అనంతరం కనీసం 22 సార్లు రష్యా సైన్యం ఇంటర్నెట్ యాక్సెస్‌ను తగ్గించింది.