మన తెలుగు సినిమా మర్చిపోలేని నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. హీరోగా మినహా ఒక నటుడిగా ఎన్ని పాత్రలు చేయాలో అన్ని పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర విషాదం ఉంది. కొడుకు మరణం ఆయనకు తీరని లోటు అనే చెప్పాలి. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కోటా శ్రీనివాసరావు కనపడలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
Also Read:అటు చంద్రయ్య ఇటు బాలయ్య…మధ్యలో మనవడు దేవాన్ష్…!
అప్పట్లో హీరోయిన్లు లావుగా ఉన్నా ప్రేక్షకులు ఆదరించేవారని ఆయన తెలిపారు. సావిత్రిలా ఎక్స్ ప్రెషన్లు ఎవరు ఇవ్వగలరని ప్రశ్నించారు. సౌందర్య వరకు ఎంతోమంది హీరోయిన్లు తమ నటనతో మెప్పించారన్నారు కోటా. ఆర్థికంగా చితికిపోవడం వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం అన్నారు. తాను సంపాదించుకున్న ఆస్తుల విషయంలో తృప్తి ఉందని చెప్పుకొచ్చారు. తనకు ఎన్ని రూ.కోట్లు ఉన్నాయో తనకు తెలుసు అన్నారు.
కొన్ని కోట్ల మంది కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు. కోట్ల ఆస్తులు ఉన్నా కొడుకును పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో వాతావరణం వేరని ఇప్పటి వాతావరణం వేరని అన్నారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు.
Also Read:రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు యత్నం… అధికారిణిపై…!