అక్కినేని నాగార్జున కెరీర్ లో కొన్ని సినిమాలు చరిత్ర సృష్టించాయి. మంచి కథలతో ఆయన స్టార్ దర్శకులతో సినిమాలు చేయగా అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అంటే నాగార్జున క్రేజ్ తగ్గింది గాని అప్పట్లో మాత్రం ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. శివ సినిమా తర్వాత నాగార్జునతో సినిమా చేసేందుకు చాలా మంది ఎదురు చూసారు. ఫ్యామిలీ సినిమాలు కూడా బాగా చేసారు.
ఈ క్రమంలోనే ఆఖరి పోరాటం అనే సినిమా చేసారు నాగార్జున. ఈ సినిమా నాగార్జునకు రావడం వెనుక ఆసక్తికర కథ ఉంది. ముందు ఈ సినిమా కథను రచయిత యండమూరి వీరేంద్ర నాథ్… చిరంజీవికి చెప్పారు. అయితే ఆయన ఇందులో కథ ఏం ఉందని, సినిమా ఎవరు చూస్తారు వద్దు అన్నారట. ఆ తర్వాత కొన్ని రోజులకు చలసాని అశ్వినీ దత్… యండమూరి ఆఫీసుకి వెళ్లి మంచి కథ ఏమైనా ఉందా అని అడిగారట.
అప్పుడు ఈ కథ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథ తీసుకుని రాఘవేంద్ర రావు వద్దకు వెళ్ళగా ఆయన మొత్తం చూసి ఇది నాగార్జునకు అయితే బాగుంటుంది అన్నారట. వెంటనే అశ్వినీ దత్ నాగార్జునకు ఫోన్ చేసి మంచి కథ రెడీ గా ఉందని సినిమా చేద్దామని అన్నారట. నాగార్జున కథ కూడా వినకుండా సినిమాకు సైన్ చేసారు. ఒకరకంగా నాగార్జున కెరీర్ లో ఇది చరిత్ర సృష్టించిన సినిమా.