రంగుల ప్రపంచంలో ఒక్కసారి స్థిరపడటం అనేది సవాల్ అనే చెప్పాలి. చాలా మందికి రంగుల ప్రపంచంలో ఏ విధంగా నిలబడాలో అర్ధం కాక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కొందరు మాత్రం అన్ని రకాలుగా పరిస్థితులను తమకు అనువుగా మార్చుకుని నిలబడుతూ ఉంటారు. అందులో యాంకర్ సుమ ముందు వరుసలో ఉంటారు.
Also Read: రాత్రి చపాతి తినడం మంచిదేనా…? ఎవరు తినడం మంచిది…?
ఒక్కసారి సుమ సక్సెస్ సీక్రెట్స్ చూస్తే…
ఆమె అభిమానులు చెప్పే మాట… ఆమెలో కష్టపడే తత్వంతో పాటుగా పెద్దల విషయంలో ఆమె చూపించే గౌరవం, నిర్మాతలకు ఆమె ఇచ్చే విలువ అని అంటూ ఉంటారు. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి… ఎప్పటికప్పుడు సుమా తనను తాను మార్చుకుంటూ ఉంటారు. తన ఆహార్యం ఎలా ఉన్నా సరే… ఆమెలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ గాని, కాలానికి తగిన విధంగా ప్రోగ్రాం లు చేయడం గాని ఆమెకు బాగా కలిసి వచ్చాయి.

Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా మరణాలు..!
Advertisements
కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ అయినా సరే తెలుగు భాష మీద ఆమె సాధించిన పట్టు అంతా ఇంతా కాదు. ఆమె గురించి తెలియని వాళ్లకు ఆమెను పరిచయం చేసి ఆమెతో తెలుగు మాట్లాడితే ఆమె తెలుగమ్మాయి అనుకుంటారు. భార్యగా, కోడలిగా, తల్లిగా అన్ని పాత్రలకు న్యాయం చేస్తూ బుల్లి తెర మీద తన మార్కు వేసుకున్నారు. సినీ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సుమ అక్కడి వాతావరణం నచ్చక యాంకర్ గా వచ్చేశారు. ఆమె భర్తకు తెలుగులో ఉన్న పరిచయాలు, రాజీవ్ కనకాల తండ్రికి ఉన్న పేరు కూడా ఆమెకు బాగా కలిసి వచ్చాయి. ఈటీవీలో అడుగు పెట్టిన తర్వాత సుమా కెరీర్ పీక్స్ కి వెళ్లిందని అంటూ ఉంటారు.