అరుంధతి సినిమాలో విలన్ పాత్ర గుర్తుకు వస్తే ఇప్పటికీ కొందరిలో చిన్న భయం ఉంటుంది. సినిమాలో పాత్రే అయినా సరే ఆ పాత్ర చేసిన సోను సూద్ ని చూస్తే కొందరికి అదే గుర్తుకు వస్తుంది. నటన పరంగా చూస్తే సోను కాకుండా ఎవరు చేసినా సరే ఆ పాత్ర సెట్ అవ్వదు అనేది వాస్తవం. అరుంధతి పాత్ర విషయంలో నిర్మాత, దర్శకుడు ఎంత కష్టపడ్డారో విలన్ పాత్ర విషయంలో కూడా అంతే కష్టపడ్డారు.
Also Read:టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్… వారి తోబుట్టువులు!!
అసలు దాని వెనుక కథ ఒకసారి చూస్తే… పశుపతి పాత్రకు గాను ముందు తమిళనటుడు పశుపతిని తీసుకుందామని చిత్ర యూనిట్ భావించింది. ఆ పాత్రకు ఆయన పేరునే పెట్టారు. కాని ఆయన కొన్ని సన్నివేశాలకు సరిగా సెట్ అవ్వలేదు. అఘోరా వేషం బాగానే సరిపోయింది గాని అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడే సన్నివేశాల్లో తేలిపోయినట్టు కనిపించారు.
దీనితో ఆయనను వద్దు అనుకున్నారు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. ఆ తర్వాత ముకేష్ ఋషీ ని కూడా అనుకున్నారు గాని ఆయన కూడా సెట్ అవ్వలేదు. అదే టైం లో హింది సినిమా చూస్తున్న నిర్మాతకు సోను సూద్ కనిపించారు. ఆ పాత్రకు సోను సరిగా సరిపోతారని బలంగా నమ్మారు నిర్మాత. కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసినా సరే సోనుకి అంతగా గుర్తింపు రాలేదు. కాని ధైర్యం చేసి నిర్మాత ఆ అడుగు వేసారు. ఇక ఫకీర్ పాత్రకు ముందు నసీరుద్దీన్ షా అయితే బాగుంటుంది అని భావించినా ఆయన దొరకలేదు. ఆ తర్వాత నానా పటేకర్, అతుల్ కులకర్ణి వంటి వారిని సంప్రదించగా డేట్స్ లేకపోవడంతో షాయాజీ షిండేని సెలెక్ట్ చేసారు.
Also Read:1100 ఎకరాల్లో ఆయిల్ పామ్ నర్సరీలు