టాలీవుడ్ లో కొందరి మీద ఎక్కువగా కాపీ చేసారు అనే ఆరోపణలు వినపడుతూ ఉంటాయి. అగ్ర హీరోలతో సినిమాలు చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి మీద ఈ విమర్శలు ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ప్రతీ సినిమాలో ఏదోక సన్నివేశం కాపీ కొడతారు అనే విమర్శలు మనం వింటూనే ఉంటాం. ఫ్యాక్షన్ సినిమా చేసినా అందులో కాపీ ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆయన కెరీర్ పీక్స్ లో ఉంది ఇప్పుడు.
కెరీర్ మొదట్లో చేసిన అతడు సినిమా కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంది అప్పట్లో. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను కాపీ చేసారని ప్రచారం జరిగింది. ఏ సీన్ లు అనేది ఒకసారి చూస్తే… పూజారి ఇంటికి వెళ్లి మహేష్ బాబు డబ్బులు వేస్తాడు. ఆ డబ్బులు వేసే సీన్ ను కాపీ చేసారని అన్నారు. ఒరిజినల్ సీన్ లో అయితే రాముడు, లక్ష్మణుడు వచ్చారని ఉంటుంది. ఇందులో సీత లేని రాముడు తోక లేని హనుమంతుడు వచ్చారని ఉంటుంది.
యముడు అనే బుక్ నుంచి ఈ సీన్ ను కాపీ చేసారని అంటారు. అలాగే అర్ధరాత్రి స్మశానం కు వెళ్ళిన సీన్ పై కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. ఇది కూడా కాపీ చేసారని చెప్పగా అప్పుడు పుస్తక రచయిత దీనిపై తన అనుమతి తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తోనే ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ సినిమా విడుదల కానుంది.