ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో అతడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మహేష్ బాబు రేంజ్ ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా పెరిగింది అనే మాట వాస్తవం. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన పోకిరి సినిమా కూడా మహేష్ బాబు ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇక ఇదిలా ఉంటే అతడు సినిమా గురించి ఫ్యాన్స్ కు కూడా తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.
Also Read:సెల్ టవర్ ఎక్కిన రైతు… ఎందుకో తెలుసా ?
అసలు ఈ సినిమాను ముందు పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. కాని అనూహ్యంగా మహేష్ బాబుకి వచ్చింది ఈ కథ. దర్శకుడు త్రివిక్రమ్ కథ రాసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళారు. ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం మొదలు పెట్టారు. ఒక అరగంట తర్వాత కథ వింటూనే పవన్ కళ్యాణ్ నిద్రపోయారు. దీనితో పవన్ కళ్యాణ్ కు ఆ కథ నచ్చలేదనే విషయం త్రివిక్రమ్ కు అర్ధమైంది.
Advertisements
ఆ తర్వాత కథను మహేష్ బాబు దగ్గరకు తీసుకువెళ్ళారు త్రివిక్రమ్. పద్మాలయా స్టూడియోస్ లో త్రివిక్రం శ్రీనివాస్ అతడు సినిమా కథను మహేష్ కు చెప్పారు. ఆ కథ మహేష్ బాబు కంటే కూడా పద్మాలయా స్టూడియోస్ అధినేత, మహేష్ బాబు తండ్రి కృష్ణకు బాగా నచ్చింది. దీనితో తానే నిర్మాతగా సినిమాను తీసుకొచ్చే ప్లాన్ చేసారు కృష్ణ. పద్మాలయా పతాకంపైనే సినిమా తీద్దామని ప్లాన్ చేసుకున్నారు.
అప్పటికి త్రివిక్రం నువ్వే నువ్వే సినిమాకు చేస్తూ ఉండగా మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు అనూహ్యంగా మురళీ మోహన్ నిర్మాత అయ్యారు. నిర్మాత మాగంటి మురళీమోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ కు అడ్వాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ టాలెంట్ తెలియడం తోనే ఆయన అడ్వాన్స్ ఇచ్చారు.
అయితే… ఈ సినిమా కంటే ముందు స్రవంతి రవికిషోర్ కు ఒప్పుకోవడంతో త్రివిక్రం రెండవ సినిమా జయభేరి పతాకంపై చేస్తానని మాట ఇచ్చేసారు. అదే విషయాన్ని మహేష్ బాబుకు చెప్పడం… ఆయన కొన్ని రోజులు ఆలోచించుకుని ఓకే చెప్పడంతో… సినిమా ముందుకు వెళ్ళింది. త్రివిక్రమ్ దర్శకునిగా తొలి సినిమా నువ్వే నువ్వే పూర్తి చేయగా… నాని, అర్జున్ సినిమాలు షూటింగ్ ముందుకు వెళ్తుంది.
అయితే ఈసారి మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్ ని కలిసి అతడు సినిమా గురించి అడిగారు. ఇక త్రివిక్రమ్ రెడీ గా ఉండటంతో సినిమా చేసారు. వర్షం సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న త్రిషకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక సినిమాలోని 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అనే కీలక పాత్రకు గాను ముందు శోభన్ బాబుని అనుకున్నారు. మురళి మోహన్ కు ఆయన అత్యంత సన్నిహితుడు.
అందుకోసం బ్లాంక్ చెక్ కూడా శోభన్ బాబుకి పంపించారు. మురళి మోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో నిలబడటానికి శోభన్ బాబు సలహాలే కారణం. దీనితో బ్లాంక్ చెక్ ఇచ్చేసారు. కాని ఆయన వృద్ద పాత్ర చేయడానికి ఇష్టపడలేదు. చివరికి నాజర్ ను అడిగారు. మహేష్ ఒకే చేసిన 3 సంవత్సరాలకు సినిమాను ప్రారంభించారు. ఇక జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.
Also Read:సలార్ మెయిన్ విలన్ ఎవరో తెలుసా ?