పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక రేంజ్ లో యూత్ లో క్రేజ్ తీసుకొచ్చిన సినిమా బద్రీ… ఈ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. బద్రీ… బద్రీ నాథ్ అంటూ ఆయన చెప్పిన పేరు ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి ఖుషీ సినిమా వరకు పవన్ కళ్యాణ్ కు వరుస హిట్స్ వచ్చాయి. జానీ సినిమానే ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టింది.
Also Read:కొడంగల్ లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేని అడ్డుకున్న దళిత సంఘాలు
తమ్ముడు, తొలిప్రేమ సినిమాలు పవన్ కు యూత్ లో క్రేజ్ తెచ్చినా… పవన్ స్టైల్ కు ఫిదా అయిపోయిన సినిమా మాత్రం బద్రీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి టీవీ లో వచ్చినా చూస్తారు. పవన్ తో ఎలా అయినా సినిమా చేయాలని ఆయనకు పూరి కోటి రూపాయల చెక్ ఇచ్చారట. ఈ క్రమంలో… ఆయనకు కథ చెప్పడానికి వెళ్లి రెండు నిమిషాల్లో చెప్పేసారట పూరి. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమలో ఉంటారు, ఆ అమ్మాయి హీరోతో మరో అమ్మాయిని ప్రేమించాలన్న పందెం వేస్తుంది…
ఆ పందెంలో వాళ్ళు నిజంగా ప్రేమలో పడతారు. ఆ లైన్ చెప్పిన వెంటనే పవన్ మరో ఆలోచన లేకుండా ఒకే చేసారు. ఆ సినిమా స్టోరీ పవన్ ఒకే చేయడం ఒక సంచలనం. పూరి జగన్నాథ్ ఆ తర్వాత తిరుగులేని డైరెక్టర్ అయిపోయారు. ఆయనకు మొదటి సినిమా అదే కావడం విశేషం. కథ ఒకే అయిన వెంటనే నేషనల్ స్టార్ అయిన అమీషా పటేల్ ను, బాలీవుడ్ కే చెందిన రేణుదేశాయ్ ను హీరోయిన్ లుకా తీసుకున్నారు. 2000 ఏప్రిల్ లో వచ్చిన ఈ సినిమా 45 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. బద్రీ కేవలం ఫాస్ట్ వీక్ లో 2.5 కోట్ల షేర్ సాధించింది.
Also Read:కరోనా ఎఫెక్ట్ – నీరసంగా శృతి హాసన్