అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగింది అనే మాట వాస్తవం. అఖండ సినిమా తర్వాత ఆయనతో సినిమా చేయడానికి కొందరు దర్శకులు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవతం విషయానికి వస్తే ఆహా షో తర్వాత ఆయన సతీమణి వసుంధర కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
Also Read:భీమ్లా నాయక్ సెట్ లో హరీష్ శంకర్.. త్వరలో యాక్షన్ షురూ
రానా ఎపిసోడ్ తర్వాత ఆమె గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇక ఆమె గురించి చూస్తే… వీరు ఇద్దరికీ 1982 లో వివాహం జరిగింది. శ్రీరామ దాసు మోటార్ ట్రాన్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె అయిన వసుంధర కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఆమె బాలయ్యను వివాహం చేసుకున్నారు. కాకినాడలో రామ్ రహీం సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను చూసారట వసుంధర తల్లి.

బాలకృష్ణ రిక్షా తొక్కే సీన్ చూసి… ఎన్టీఆర్ గారి అబ్బాయి ఏంటీ రిక్షా తొక్కుతున్నారని, అది షూటింగ్ కి అని తెలియక షాక్ అయ్యారట. ఈ విషయం… బాలకృష్ణ వివాహం తర్వాత ఆయనకు… అత్తగారే స్వయంగా చెప్పారట. ఇక బాలకృష్ణ ప్రస్తుతం అనీల్ రావిపూడి, గోపి చంద్ మలినేని దర్శకత్వంలో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులు కూడా ఆయనతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read:నిన్న ఐపిఎల్ ఆక్షన్ లో అందరికి ఇబ్బందిగా మారిన ఈ తెలుగు వ్యక్తి తెలుసా…?