మన జీవితంలో ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేది ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం ద్వారా మనకు అందించారు. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఎం చేయాలి ఏంటీ అనేది స్పష్టంగా చెప్పారు. ఇక భార్యను ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొన్ని లక్షణాలు ఉన్న భార్య దొరికితే అసలు వదులుకోవద్దని చెప్పారు.
Also Read:సార్… మీడియా వింటోంది..!
భార్యను ఎంపిక చేసుకునే విషయంలో సహనంగా ఉండే స్త్రీని మాత్రమె ఎంపిక చేసుకోవాలి. అలాంటి స్త్రీ భర్తకు బలంగా మారుతుంది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సహాయం అందించే విషయంలో ఈ తరహా స్త్రీలు ముందు వరుసలో ఉంటారు. ఆర్ధిక ఇబ్బందుల సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇతరులతో మంచితనం తో ఉంటూ దూకుడుగా ఉండకుండా మర్యాదగా మాట్లాడే వారు దొరికితే వాళ్ళను వదులుకోవద్దు. వాళ్ళు భర్తకు అన్ని విధాలుగా కూడా అదనపు బలం అవుతారు. అలాంటి స్త్రీతో పరువు ప్రతిష్టలు పెరగడమే కాకుండా వ్యక్తిగత, కుటుంబ గౌరవం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా వాళ్లకు ఒక స్పష్టత ఉంటుంది.
ఇక ఆచార సాంప్రదాయాలను పాటించే స్త్రీలు, మన మతాన్ని గౌరవించే వారిని ఎంపిక చేసుకోవడం మంచిది. ఇలాంటి భార్యలు ఉంటే మనకు దురదృష్టం కూడా అద్రుష్టంగా మారుతుంది. కాబట్టి భార్యను ఎంపిక చేసుకునే సమయంలో నీతి శాస్త్రం ఫాలో కావడం మన జీవితానికి మంచిది.
Also Read:చాణక్య నీతి: జీవితం లో మీరు విజయం సాదించాలనంటే ఉదయం లేవగానే ఈ 5 పనులు చేయాలట !