ఈ రోజుల్లో కొందరు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించాలి అంటే నిజంగా అద్రుష్టం ఉండాలి అంటారు. పవన్ కళ్యాణ్ లాంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి డైరెక్టర్ గా పని చేయాలంటే రాసి పెట్టాలి అని అంటారు కొందరు యువ దర్శకులు. సినిమాలో పవన్ కళ్యాణ్ ను అభిమానులకు నచ్చిన విధంగా చూపించడం అనేది ఒక సవాల్. అలాంటిది ఒక అభిమాని తనకు నచ్చినట్టు పవన్ ను చూపించే అవకాశం వస్తే…?
Also Read:ఆటోలతో విన్యాసాలు.. ఆరుగురు అరెస్ట్
ఆ అవకాశమే వచ్చింది భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్రకు. రీమేక్ సినిమా అయినా భీమ్లా నాయక్ కథను పవన్ ఫాన్స్ కు నచ్చిన విధంగా మార్పులు చేసాడు. ఇక అతని బ్యాక్ గ్రౌండ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అతని నేపధ్యం ఒకసారి చూస్తే… అతనిది తెలంగాణాలోని నల్గొండ జిల్లా. ఆయన తండ్రి పేరు రామచంద్రా రెడ్డి. నల్గొండలో నేతాజీ హైస్కూల్ వారిదే. సినిమా రంగంలోకి పవన్ మీద అభిమానం తో వచ్చారు ఆయన.
ఇక తాను సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు చెల్లెలు గౌతమి తనకు ఎంతగానో అండగా నిలిచారని ఆ తర్వాత తన భార్య గీత అందించిన సహకారం మరువలేను అని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన సాగర్… సినిమా రంగం పై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వెళ్ళారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆయనకు… 2011 లో విడుదలైన పంజా సినిమా ఆడియో ఫంక్షన్ కు రావడానికి తాను ఎంతో కష్టపడ్డారట. ఈ సినిమా కంటే ముందు నారా రోహిత్, శ్రీ విష్ణు వంటి హీరోలతో సినిమాలు చేసాడు.
Also Read:రక్షణ శాఖ వెబ్ సైట్ హ్యాక్… ఆ విషయం ఉక్రెయినియన్లకు తెలియదన్న మంత్రిత్వశాఖ