మన దేశంలో సాంప్రదాయాలకు కాస్త ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఆ సాంప్రదాయాల నుంచి వచ్చిన భయాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది అనే మాట వాస్తవం. అలాంటిదే మనం బయటకు వెళ్ళినప్పుడు పిల్లి ఎదురు రావడం అనేది మంచి శకునం కాదు అనడం. పిల్లి ఎందుకు ఎదురు రావోద్దో చాలా మందికి తెలియదు. దాని వెనుక ఉన్న కారణం చూద్దాం.
Also Read:పుట్టిన పిల్లలకు వెంటనే కొత్త బట్టలు ఎందుకు వేయరు…? పుట్టబోయే బిడ్డకు ముందుగా బొమ్మలు ఎందుకు కొనరు…?
పిల్లి రావడం మంచి శకునం కాదు అనేది కొంత నిజమే అని చెప్పాలి. 17, 18 శతాబ్దాల కాలంలో ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్ళడం తక్కువగా ఉండేది. రోజూ కచేరీకి వెళ్ళడం, విద్యాభ్యాసలకు వెళ్ళడం వంటివి మాత్రమే ఉండేవి. ఇక పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనేవి అప్పట్లో అంత హడావుడి ఉండేది కాదు. ముఖ్యంగా పిల్లులకి చాలా త్వరగా వాతావరణ మార్పులు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెంచుకునే పిల్లి మన కాళ్ళల్లో తిరుగుతుంటే లేదా హడావుడిగా మన ముందు నుంచి పరిగెడితే… ఖచ్చితంగా ఏదోక జంతువు గాని ప్రమాదకరమైన కీటకం గాని ఉందని అర్ధం అని బలంగా నమ్మే వాళ్ళు.
పిల్లులు చాలా స్పీడ్ గా వేరే జంతువుల రాకను గుర్తిస్తాయి. ఈగలు, దోమల సౌండ్ కూడా వాటికి వెంటనే తెలుస్తుంది. పిల్లి అలా మన కాళ్ళ మధ్యలోకి వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా ఏదో ప్రమాదం ఉందని అర్ధం అని అప్పట్లో బలంగా నమ్మే వాళ్ళు. పిల్లులు మాదిరిగానే వితంతువులను కూడా చూసే వాళ్ళు అప్పట్లో. వితంతువు ఎదురు వస్తే… తమ ఇంట్లో ఉండే ఆడ పిల్లలకు కూడా అలా జరుగుతుందేమో అనే భయం ఉండేది. దానికి కారణం అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. 25 ఏళ్ళకే భర్తలను కోల్పోయిన మహిళలు కనపడే వారు.
Also Read:ప్లీజ్… ఆ పాత్ర మీరే చేయండి సార్.!