మేఘాలు బరువుగా ఉన్నా సరే ఆకాశంలో నుంచి ఎందుకు కిందకు పడవు…? ఈ ఆలోచన చాలా మందిలో ఉంటుంది కదూ… అసలు మేఘాలు ఎందుకు గాల్లో ఉంటాయి. దాని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం. మేఘాలలో బరువు సంగతి పక్కన పెడితే… మేఘాలలో ఉండేది కేవలం అతి చిన్న నీటి బిందువులు. ఇవి దాదాపు ధూళి కణాల పరిమాణంలో మాత్రమే ఉంటాయి.
Also Read:రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది?
ఆ బిందువుల భౌతిక ప్రవర్తన ధూళి కణాల మాదిరిగానే ఉంటుంది. జలపాతాలు, డాంల నుంచి వచ్చే నీళ్ళు కూడా ఇలాంటి పరిమాణం ఉన్న కణాలను సృష్టిస్థాయి. మన ముక్కు నుంచి వచ్చే తుమ్ము కూడా ఇలాంటి బిందువులనే సృష్టిస్తు ఉంటుంది. మాములుగా భూమి మీద అయితే గనుక కొంత సమయం గాల్లో ఉండి ఆ తర్వాత కింద పడిపోతాయి. కాని మేఘాల విషయంలో అలా జరగదు.
ఎందుకంటే మేఘాలు చాలా ఎత్తులో ఉంటాయి. దానికి తోడు వాటి కింద వేడి గాలి కూడా ఉంటుంది. మేఘాలు తేలి ఉండటానికి కారణం వేడి గాలుల సాంద్రత. సాంద్రత తక్కువగా ఉండే గాలులు ఎప్పుడూ పైకి వెళ్తాయి. ఈ గాలులు మేఘాలనూ, వాటిలో ఉంటే ధూళి లాంటి నీటి బిందువులనూ ఎప్పుడూ తేలియాడే విధంగా చేస్తాయి. కొన్ని బిందువులు కిందకు పడినా అవి భూమి మీద పడేలోపు ఆవిరి అయిపోతాయి.
అయితే మేఘాలలో ఎప్పుడైనా తేమ, పైన గాలులు, క్రిందన ఉన్న గాలుల మధ్య ఉష్ణోగ్రతలలో తేడా వస్తే గనుక… చర్య జరిగి చిన్న చిన్న నీటి బిందువులు కలిసి పెద్ద వర్షపు బిందువుల మాదిరిగా గాని లేదా వడగళ్లుగా గానీ మారి క్రింద పడిపోతాయి. వాటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేడి గాలులు పైకి పట్టి ఉంచలేవు.
Also Read:మోడీ మైండ్ గేమ్.. కేసీఆర్ కు బిగ్ షాక్!