టాలీవుడ్ లో కొందరు యువ దర్శకులు సినిమాలు చేసినా చేయకపోయినా వార్తల్లో ఉంటారు. అందులో ముందు వరుసలో ఉండే పేరు కొల్లి బాబీ. ఈ యువ దర్శకుడు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో స్టార్ హీరోలతో సినిమాలు చేసాడు. అందులో కొన్ని హిట్స్ కాగా మరికొన్ని ఇబ్బంది పెట్టాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాబీకి అనుకున్న విధంగా ఫలితం ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత జైలవకుశ సినిమా చేసాడు.
Also Read:మంచు ‘లోయ’లో పడి ముగ్గురు సైనికుల మరణం
ఆ సినిమా దర్శకుడి కంటే కూడా ఎన్టీఆర్ కు ఎక్కువ పేరు వచ్చింది. వెంకీ, నాగచైతన్యతో వెంకీమామ సినిమా చేసాడు గాని అనుకున్న ఫలితం రాలేదు. ఆయన చేసిన సినిమాలు అన్నీ స్టార్ హీరోలతోనే కావడం విశేషం. గుంటూరులో పుట్టిన బాబీ ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. ముందు కోన వెంకట్ దగ్గర సహాయ దర్శకుడిగా ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి దగ్గర పని చేసాడు. టాలెంట్ ఉండటంతో స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చారు.
ఇక అతని వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే… అనూష అనే అమ్మాయిని ప్రేమించాడు. కాని ఆ ప్రేమను ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు అని టాక్. కారణం వేర్వేరు కులాలు కావడమే అని అంటారు. కాని చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చెస్ స్టార్ ప్లేయర్ దోనవల్లి హారిక… బాబీ భార్య అనూషకు స్వయానా చెల్లెలు. ఇక బాబీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచాడు.