సినిమాలో హీరోయిన్ లు ఎంత అందంగా ఉన్నా సరే వాళ్లకు డబ్బింగ్ చెప్పే వాళ్ళు సరిగా చెప్పలేదు అంటే మాత్రం ఆ పాత్ర పులిహోర అయినట్టే. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు సింగర్ సునీతకు చాలా మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఆమె క్రేజ్ తగ్గి కొత్త వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.
Also Read:సమైక్య రాష్ట్రంలో ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉంది?
ఇక ఇప్పుడు మనం చెప్పుకునే డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరు శ్వేత. ఈమెకు సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన సినిమా తో ఈమె మరింత ఫేమస్ అయింది. కృతి శెట్టికి ఈమె చెప్పిన డబ్బింగ్ కు చాలా మంది ఫిదా అయిపోయారు. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న బేబమ్మ పాత్రకు శ్వేత డబ్బింగ్ చెప్పారు. ఆమె రేడియో మిర్చీ లో ఆర్జే గా పని చేస్తారు. అసలు ఆమె సొంత ఊరు వైజాగ్. మా మ్యూజిక్ లో వచ్చే సంతింగ్ స్పెషల్ లో యాంకర్ శశీ తో పాటుగా వచ్చే వారు.
ఇటీవల ఇటీవల ఈటీవీలో వచ్చే వావ్ ప్రోగ్రాం లో ఆమె కనిపించారు. ఈ ప్రోగ్రాం లో తాను డబ్బింగ్ కి ఏ విధంగా వచ్చాను, ఏంటీ అనేది చెప్పారు. మళ్ళీ రావా సినిమాకు పని చేసే మిర్చీ కిరణ్ డబ్బింగ్ ట్రై చేయమని అడగడం తో శ్వేత ట్రై చేయడం ఆ తర్వాత అది సినిమా వాళ్లకు నచ్చడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత కల్యాణి ప్రియదర్శన్ సహా పలువురికి డబ్బింగ్ చెప్పారు. భరత్ అనే నేను సినిమాలు కియారా అద్వానికి చిత్రలహరి సినిమా లో నివేత పెతురాజ్ కి డబ్బింగ్ చెప్పారు.
Also Read:నిర్వాసితుల ఉసురు తగులుద్ది.. విజయశాంతి శాపనార్ధాలు