పారిస్ వెళ్తే ఈఫిల్ టవర్ కచ్చితంగా చూడాల్సిందే. లేదంటే మాత్రం వెళ్ళినందుకు ప్రయోజనం ఉండదు మరి. అయితే ఈఫిల్ టవర్ కు సంబంధించి కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి విషయమే ఈఫిల్ టవర్ ఫొటోస్ విషయంలో ఉన్న నిబంధనలు. ఈఫిల్ టవర్ ను ఫోటో తీస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది అనే ప్రచారం ఉంటుంది. అసలు అది ఎంత వరకు నిజం అనేది ఒకసారి చూద్దాం.
Also Read:కాషాయ దండు.. ఫుల్ స్పీడులో బండి
ఫోటో తీయటం తప్పు కాదు గాని అలా తీసిన ఫోటో దేనికి వాడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రి దీపాలతో అలంకరించబడిన టవర్ ఫోటో తీస్తే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫ్రెంచి కాపీరైట్ల చట్టం ప్రకారం ఏదైనా ఒక వస్తువు సృష్టించిన వారికి దాని వితరణ పై పూర్తి హక్కులు ఇస్తారు. సదరు వ్యక్తి చనిపోయిన తర్వాత 70 ఏళ్ళ వరకు కాపీరైటు చట్టం అమలులో ఉంటుంది. ఈఫిల్ టవర్ నిర్మాత ఇంజనీరు గుస్తావ్ ఈఫిల్ 1923లో ప్రాణాలు కోల్పోయారు. 70 ఏళ్ళ తరువాత 1993లో కాపీరైట్ చట్టం విరమించింది.
ఆ తర్వాతే టవర్ ను పబ్లిక్ డొమైన్ లోకి అనుమతి ఇచ్చారు. అందుకే పగటిపూట ఈఫిల్ టవర్ ఫోటో తీసుకుని ఏ ప్రయోజనానికైనా వాడుకునే అవకాశం ఉంది. ఈఫిల్ టవర్‌పై లైట్లు, వాటి నిర్మాణశైలి 1985లో పియరీ బిడోచే రూపొందించారు. ఇవి ఇంకా కాపీరైట్ చట్టం అమలులోకి వస్తాయి. లైట్లు కనిపించే రాత్రి సమయంలో టవర్ ఫోటో లేదా వీడియో తీసుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునే హక్కులు కల్పించారు. దాన్ని కమర్షియల్ గా వాడాలి అంటే టవర్ యాజమాన్యం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:గంగులా..మీ వాటా ఎంత..?