మెగా హీరోలు అందరూ దాదాపుగా సన్నిహితంగా ఉంటారు. ఎవరి మధ్య విభేదాలు లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒక్క అల్లు అర్జున్ మినహా అందరూ కలిసే ఉంటారని అంటారు. మెగా హీరోల్లో రామ్ చరణ్ కు ఎక్కువ క్రేజ్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ కు ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పాలి. ఈ హీరో చిరుత సినిమాతో మంచి హిట్ కొట్టి మగధీర సినిమాతో తన రేంజ్ పెంచుకున్నాడు.
Also Read:ఇది రెయిన్ కోట్.. జాకెట్ కాదంటున్న రాహుల్ గాంధీ
ఆ తర్వాతి నుంచి మెగా హీరోల్లో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోగా తండ్రి పేరు నిలబెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ పెరిగింది. రంగస్థలం సినిమాతో నటుడిగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇతర హీరోలకు కూడా అనేక సలహాలు ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంచితే రామ్ చరణ్… వరుణ్ తేజ్ కోసం చేసిన ఒక చిన్న త్యాగం వైరల్ అవుతుంది.
వరుణ్ తేజ్ కెరీర్ లో ఫిదా సినిమా మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కథను ముందు రామ్ చరణ్ కు శేఖర్ కమ్ముల చెప్పారట. ఆ కథ విన్న రామ్ చరణ్… తన కంటే వరుణ్ తేజ్ కి ఈ కథ బాగా సెట్ అవుతుందని చెప్పాడట. దీనితో మరో ఆలోచన లేకుండా వరుణ్ తేజ్ కు శేఖర్ కమ్ముల కథ చెప్పడం, సినిమా ఓకే చేయడం జరిగాయి.
Also Read:సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు..!