గుడికి వెళ్లడం, దేవుడికి పూజలు చేయడం, తీర్ధ ప్రసాదాలు స్వీకరించడం అనేది హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా కనపడుతుంది. అయితే శఠగోపం ఎందుకు, హారతి ఎందుకు అనేది చాలా మందికి తెలియదు. ఇక హారతి కళ్ళకు అద్దుకోవడం మంచిది కాదని, హారతి అద్దుకోవడం మంచిది అని ఎవరికి వారు చెప్పేది చెప్తూ ఉంటారు. అయితే హారతి విషయంలో పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం కచ్చితంగా కళ్ళకు అద్దుకోవాలి అంటారు.
Also Read:బిర్యాని వండే పాత్రలు వెడల్పుగా ఎందుకు ఉంటాయి…?
భగవంతునికి ఇచ్చిన హారతి మనం కళ్లకు అద్దుకోవటం 100% సరైన విధానమట. ఆలయంలో భగవద్దర్శనంతో పాటుగా హారతి కళ్లకు అద్దుకోవటం, తీర్ధం స్వీకరించడం, శిరస్సుపై శఠగోపం తీసుకోవడం వంటివి అలాగే కొంచెమైనా దేవుడికి నైవేద్యంగా చూపించిన ప్రసాదం స్వీకరించడం తరతరాలుగా కొనసాగుతున్న ఆచారంగా చెప్పాలి. ఇక హారతి తీసుకోవడం అనేది మన కళ్ళకు చాలా మంచిది అంటారు.
కర్పూరంలో ఉండే ఘాటుసుగంధం సున్నితమైన కనురెప్పలపైన చేరిన సూక్ష్మజీవులను నశింపజేస్తుందని ఆయుర్వేదపరిజ్ఞానం ఉన్న వారు చెప్తారు. అసలు కర్పూరంలో, హారతిలో నరదృష్టి, దుష్టశక్తిని దూరంచేసే అపురూప లక్షణాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. కర్పూరంతో చేసుకొనే కొన్ని చిన్న తంత్రాలతో జీవితమే అద్భుతంగా మార్చుకోవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు. హారతి చేతులతో స్ప్రు శించి తలమీద అద్దుకోవడం అనేది సరైన పద్ధతి. అయితే హారతి చేతులతో స్ప్రు శించి తలమీద అద్దుకోవడం అనేది కొందరు చెప్పే మాట.
Also Read:కువైట్ లో భారత ఉత్పత్తుల అమ్మకాలు బంద్