టాలీవుడ్ లో న్యాచరుల్ స్టార్ నానీ టాలెంట్ తో పైకి వచ్చి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. కొన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో షాక్ ఇచ్చినా సరే ఇప్పుడు కథల విషయంలో కాస్త సీరియస్ గా ఫోకస్ చేసాడు. మంచి కథలను ఎంపిక చేసుకుని మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేసే ఆలోచన చేస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ధైర్యంగా సినిమాలు విడుదల చేసాడు నానీ.
Also Read:టీడీపీ సీనియర్ నేత కన్నుమూత..!
ప్రస్తుతం దాదాపుగా 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. నానీ సొంత జిల్లా కృష్ణా జిల్లా. చల్లపల్లి దగ్గర ఆయన సొంత ఊరు. సహాయక దర్శకుడిగా సినిమాల్లోకి వచ్చి అష్టాచెమ్మా సినిమా ద్వారా ముందుకు వచ్చాడు. ఆ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. ఇక రైడ్ సినిమాతో నానీ క్రేజ్ బాగా పెరిగింది. ఇక నానీ 2017 లో అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయిదేళ్ళ ప్రేమ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక నానీ పెళ్లి చేసుకున్న అంజనా ఫ్యామిలీకి చాలా మంచి చరిత్రే ఉంది. వాళ్ళ తాతగారు ప్రసిద్ధ శాస్త్రవేత్త ఎరగత్తి నాయిడమ్మ, ఆయన ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారిది తెనాలి సమీపంలోని ఎరువల గ్రామం. సాంకేతిక రంగంలో ఆమె తాతగారు చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. 1985 లో కనిష్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అంజన నాయనమ్మ పవనాబాయి. ఆమె మద్రాస్ లో ఫేమస్ గైనకాలజిస్ట్. తన భర్త మరణ వార్త తెలిసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అంజన కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేసారు.
Also Read:మహాశివరాత్రి తరువాత కొత్త జీవో… ఏపీ సర్కారు సిద్దం