టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి రెండు భాగాల దెబ్బకు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. కృష్ణం రాజు వారసుడిగా హీరోగా అడుగు పెట్టిన ప్రభాస్… ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు.
Also Read:దత్తతకు వివాహ ధృవీకరణ పత్రం తప్పని సరికాదు
ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయాలను చూస్తే… ప్రభాస్… కృష్ణం రాజు వారసుడిగా వచ్చాడని అందరూ భావిస్తారు గాని ప్రభాస్ తండ్రికి కూడా సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన తండ్రి పేరు సూర్య నారాయణ రాజు. ఆయనకు మంచి డైనమిక్ నిర్మాతగా పేరు ఉండేది. సూర్యనారాయణ తన అన్న కృష్ణం రాజుకి అండగా ఉంటూ గోపీ మూవీస్ పతాకం పై కృష్ణం రాజు నటించిన చిత్రాలను నిర్మించే వారు.
ప్రభాస్ తండ్రి… తాను ఉండగానే తాను నిర్మాతగా ఎన్నో సార్లు ప్రభాస్ ను హీరోగా పరిచయం చేయాలని కాస్త గట్టిగానే ప్రయత్నం చేసినా సరే సాధ్యం కాలేదు. ప్రభాస్ కు ఆసక్తి లేకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఈ తరుణంలో కృష్ణం రాజు కి కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా ప్రభాస్ ను తీసుకొచ్చారు. ఈశ్వర్ అనే సినిమా ద్వారా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. చాలా తక్కువ టైం కే ప్రభాస్ మంచి హీరోగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ప్రభాస్ చేసేవి అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.
Also Read:భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్