కేజిఎఫ్ 2 సినిమాతో కన్నడ సూపర్ స్టార్ యష్ క్రేజ్ పెరిగింది. మొదటి పార్ట్ కు మంచి పేరు రావడంతో రెండో పార్ట్ విషయంలో కేజిఎఫ్ సీరీస్ అభిమానులు ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. ఇక కెజిఎఫ్ తన వసూళ్లతో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో యష్ నటనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే యష్ పేరు చాలా మందికి తెలియదు. అసలు అతని పేరు నవీన్ కుమార్ గౌడ.
Also Read:రాష్ట్రమంతటా నిరసనలు.. టీఆర్ఎస్ పై నిప్పులు
యష్ కుటుంబం మధ్యతరగతి… అతని తండ్రి బస్ కండక్టర్ కాగా తల్లి హౌస్ వైఫ్. ఇక చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చితో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. కుటుంబ సభ్యులను ఏ విధంగా అడిగినా సరే వాళ్ళు ఒకే చెప్పకపోవడం తనకు సినిమాల మీద కోరిక చావకపోవడంతో ఎలాగైనా సినిమాల్లో నటించాలని సినిమా పరిశ్రమకు దగ్గరయ్యాడు. ఇక సినిమాల్ల మీద పిచ్చితో జేబులో కేవలం 300 రూపాయలతో ఇంట్లో నుంచి వచ్చేసాడు.
మైసూర్ కు చెందిన యష్ బాల్యం చాలా వరకు మైసూరులోనే గడిచింది. అతను మధ్యతరగతి కుటుంబం కావడంతో అతను బాగా చదువుకోవాలని తల్లి తండ్రులు కోరినా సరే సినిమాల మీద పిచ్చితో అడుగులు వేసాడు. ఒక ప్లాన్ ప్రకారం తానను సినిమాల్లో ముందుకు వెళ్లినట్టు చెప్పే యష్… ఇప్పుడు తన తల్లి తండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని… ఆర్ధిక కష్టాల నుంచి బయటకు వచ్చినట్టుగా యష్ ఇటీవల ఒక ఇంటర్వులో చెప్పుకొచ్చాడు.
Also Read:నెట్ ఫ్లిక్స్ కు బిగ్ షాక్, ఈ రేంజ్ లో లాస్…?